ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా 200 ఎకరాలలో జొన్న పంట నష్టపోయినట్లుగా రైతన్నలు మంగళవారం తెలిపారు. ఎకరాకు రూ. 20 వేలు అప్పు చేసి మరి పెట్టుబడి పెట్టినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు పడడంతో గింజంత నల్లగా మారిపోయినట్లుగా రైతులు తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన జొన్న రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.