గిద్దలూరు పోలీస్ స్టేషన్ లో వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పంతం నానాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగనన్న సభకు వచ్చే ప్రజలను చూస్తే పంతం నానాజీ స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయడం మానుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతతో మర్యాదగా మాట్లాడకుండా అమర్యాదగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని, ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు నాగార్జున రెడ్డి తెలిపారు.