గిద్దలూరు: ఊరిస్తున్న మబ్బులు

ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మబ్బులు ప్రజలను ఊరిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు మోస్తరు ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వాతావరణం లో మార్పులు చోటుచేసుకొని ఆకాశం మబ్బులు పట్టింది. కొద్దిగా సేపట్లో గిద్దలూరు పరిసర ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం కూడా నెలకొనడంతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్