ప్రకాశం జిల్లా గిద్దలూరులోని రైల్వే స్టేషన్ రోడ్డులో పెను ప్రమాదం పొంచి ఉందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ భారీ వృక్షం ఎండిపోయి నేలకొరిగేందుకు సిద్ధంగా ఉందని గురువారం తెలిపారు. ఇటీవల బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వృక్షం కూలి ఎవరన్నా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.