గిద్దలూరు: క్రిందపడి ఓ వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరులో నాగేశ్వరరావు అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. శ్రీ పాతాళ నాగేశ్వరరావు స్వామి దేవస్థానం సమీపంలో నాగేశ్వరరావు అకస్మాత్తుగా క్రింద పడ్డాడు. స్థానికులు వెంటనే గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే నాగేశ్వరరావు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. బంధువులు కుటుంబ సభ్యులు నాగేశ్వరరావు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్