ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామంలో బుధవారం రైతుల వద్ద శనగలు కొనుగోలు చేస్తూ మోసానికి పాల్పడుతున్న వ్యాపారిపై తూనికలు కొలతలు అధికారులు కేసు నమోదు చేశారు. కొమరోలు మండలం రౌతు పల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కాటాలో రిమోట్ సెన్సార్ ఏర్పాటు చేసి పంటను కాటా వేసే సమయంలో బరువులు తగ్గిస్తూ మోసానికి పాల్పడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.