గిద్దలూరులోని క్రిష్టంశెట్టిపల్లికి చెందిన మహిళ తన కూతురితో వేరే బాలిక గొడవ పెట్టుకుందని ఆ బాలికకు వాతలు పెట్టింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సాక్షాదారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. సదరు మహిళలకు కోర్టు ఒక్క రోజంతా కోర్టులో నిలబడాలని శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేలు జరిమానా విధించింది. న్యాయమూర్తి భరత్ చంద్ర శిక్ష విధించినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు.