గిద్దలూరు దిగుమెట్ట ఫారెస్ట్ సెక్షన్ ఫారెస్ట్ ఎఫ్. ఎస్. ఓ భూపాని వెంకటరమనాయుడు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట రామానాయుడు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అంతక్రియలు రాచర్ల స్వగ్రామమైన పాలకవీడు గ్రామంలో రేపు జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.