గిద్దలూరు: గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్

ప్రకాశం జిల్లా గిద్దలూరులో గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు మరో ముగ్గురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా నుండి దిగుమతి చేసుకొని స్థానికంగా విక్రయిస్తున్నట్లు డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 2 కేజీల గంజాయి రూ. 30 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నామని డిఎస్పి తెలిపారు.

సంబంధిత పోస్ట్