గిద్దలూరు: తాటి ముంజల కోసం ఎక్కి క్రిందపడి మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిరివెళ్ల రామచంద్రుడు తాటి ముంజల కోసం తాటి చెట్టు ఎక్కి జారీ కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడి రామచంద్రుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్