గిద్దలూరులో దంచి కొడుతున్న వర్షం

ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో వర్షం దంచి కొట్టింది. శనివారం మధ్యాహ్నం వరకు ఓ మోస్తరు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2: 30 తర్వాత ఆకాశంలో వాతావరణం మార్పులు చోటుచేసుకుని మూడున్నర తర్వాత బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల వల్ల విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్