గిద్దలూరులో మోస్తారు వర్షం

మార్కాపురం జిల్లా గిద్దలూరులో గత ఐదు రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఆదివారం రాత్రి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఈ వర్షంతో ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందారు. రానున్న రోజుల్లో కూడా గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్