కంభం: డివైడర్ ను ఢీ కొట్టిన కారు

ప్రకాశం జిల్లా కంభంలో ఆదివారం ఓ కారు అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తూ డివైడర్ ని ఢీ కొట్టి డివైడర్ పైకి ఎక్కింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమయానికి కారులోని బెలూన్లు తెచ్చుకోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు డిజైన్ లోపంతోనే గతంలో కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్