కంభం: కొడుకుని హత్య చేసిన వ్యక్తి అరెస్ట్

కంభం సర్కిల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 8వ తేదీన అర్ధవీడులో షేక్ ఖాసిం వలి అనే వ్యక్తి మద్యం మత్తులో భార్యను కత్తితో దాడి చేస్తుండగా కొడుకు షేక్ షాకీర్ అడ్డు రావడంతో తండ్రి కత్తితో కొడుకును ఛాతిలో పొడిచినట్లు వివరించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్