కంభం: డాగ్ స్క్వాడ్ తో జల్లెడ పడుతున్న పోలీసులు

కంభం మండలం లింగోజి పల్లిలో మంగళవారం బాలుడు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. 30 గంటలు దాటిన బాలుడు ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. కుటుంబ సభ్యులు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో బాలుడి చెప్పులను గుర్తించారు. డాగ్ లింగోజిపల్లి నుంచి సురే పల్లి సమీపంలోకి వచ్చి డాగ్ నిలిచిపోయింది. బాలుడిని ఎత్తుకొచ్చిన వాళ్ళు ఇక్కడ వరకు వచ్చుంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్