ప్రకాశం జిల్లా కంభం పట్టంలోని నెహ్రునగర్ మొదటి లైన్ లో గురువారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ కు చెందిన రాధే శ్యామ్ (18) అనే యువకుడు స్నానానికి వెళ్తున్న సమయంలో బాత్రూం డోర్ కు విద్యుత్ వైర్లు తాకి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.