కొమరోలులో భారీ అగ్నిప్రమాదం

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని బాదినేని పల్లి గ్రామంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో 10 వరిగడ్డివాములు మంటలు ఆహుతి అయ్యాయి. మంటలు దావాలంగా వ్యాప్తి చెందడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ తో అధికారులు అక్కడికి చేరుకొని మంటలను వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. దాదాపు రూ.3లక్షల వరకు ఆర్థిక నష్టం జరిగిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్