మార్కాపురం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన తమ పిల్లలకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని, దీనివల్ల పోలియోని శాశ్వతంగా నిర్మూలించవచ్చని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.