ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగూటి పల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వ్యక్తి ఎడవల్లి గ్రామానికి చెందిన రమణ స్థానికులు గుర్తించారు. ఆ వ్యక్తిని స్థానికులు వైద్యం కోసం గిద్దలూరు కు తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు గాయపడ్డ వ్యక్తి కుటుంబ సభ్యులకు స్థానికులు చేరవేశారు.