గిద్దలూరు గ్రామీణ ప్రాంతాలలో వర్షం

ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామీణ ప్రాంతంలో బుధవారం అకస్మాత్తుగా వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండాకాలం వానాకాలం ఒకేసారి చూస్తున్నామని ప్రజలు అంటున్నారు.

సంబంధిత పోస్ట్