గిద్దలూరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగ ప్రవేశించి, మెడికల్ షాపులోని సుమారు రూ.1.50 లక్షలు దొంగిలించినట్లు సమాచారం. పగటిపూట రెక్కీ నిర్వహించి, ఆసుపత్రి సిబ్బంది గాఢ నిద్రలో ఉండగా ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అర్బన్ సీఐ సురేశ్ ఆదివారం కేసు నమోదు చేసుకుని, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.