గిద్దలూరులో శాశ్వత నీటి పరిష్కారానికై రూ. 153. 24 కోట్లు

గిద్దలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పట్టణంలో నీటి సమస్య పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వం రూ. 153. 24 కోట్లు కేటాయించిందని నీటి సమస్య పరిష్కారానికై అధికారులు రూట్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. ఏడాది పొడుగునా పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచనలు సలహాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్