మద్యానికి బానిసై వేధిస్తున్నాడని భర్తను భార్య హత్య చేసిన ఘటనను పోలీసులు చేదించారు. కంభం పట్టణంలో ఈనెల 3వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. హత్య తర్వాత భార్య భర్త అనారోగ్యంతో మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా మీడియా సమావేశంలో డి. ఎస్. పి నాగరాజు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి శుక్రవారం నిందితురాలిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రిమాండ్ కు తరలిస్తున్నామని డిఎస్పి నాగరాజు తెలిపారు.