ప్రకాశం జిల్లా కనిగిరిలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పామూరు టౌన్ లోని మండల బిజెపి కార్యాలయంలో బిజెపి నాయకులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని, లాల్ బహదూర్ శాస్త్రి "జై జవాన్–జై కిసాన్" నినాదంతో నిరాడంబరత, నిజాయతీ, ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని నాయకులు స్మరించుకున్నారు. విజయ్ కుమార్ చారి, అరవింద్, శ్రీనివాస్ రెడ్డి, పవన్ పాల్గొన్నారు. వారి ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.