వెలిగండ్ల మండలంలోని వెలిగండ్లలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. ఈ భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి వంకలన్నీ పొంగుతున్నాయి. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్న జనంకు వర్షం పడటంతో ఉపశమనం లభించినట్టు అయింది. ఈ వర్షం వల్ల సాయంత్రం విద్యుత్‌కు అంతరాయం కలిగింది. తడిచిన గోడలు తో జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ అధికారులు హెచ్చరిక కూడిన సూచనలు చేస్తున్నారు.