కనిగిరి పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని బాలికల పాఠశాల వద్ద విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఆ సమయంలో అక్కడ జనసంచారం లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.