కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. గురువారం తక్కెళ్లపాడులో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వైసీపీ పాలనలో అరాచకాలు జరిగాయని విమర్శించారు. సీఎం చంద్రబాబు వేల కోట్లు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని చెప్పారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు.