విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కనిగిరి మండలంలోని నేలటూరి గొల్లపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది. అదే గ్రామానికి చెందిన దాసరి మాలకొండయ్య గ్రామ సచివాలయం సమీపంలో ఉన్న బోరు మోటర్ వద్ద విద్యుత్ వైరు తెగిపడి ఉండటంతో కటింగ్ ప్లేయిర్ తో జాయింట్ చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.