ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి

పామూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రహ్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు పామూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కందుకూరుకు తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్