పామూరులోని సీఎస్ పురం రోడ్డు, మమ్మీ డాడీ సెంటర్, కందుకూర్ రోడ్, టెంపుల్ స్ట్రీట్, రాచూరి వారి వీధి, సీతారాం తోట, కనిగిరి రోడ్డు, అంకాలమ్మ వీధులలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.