కనిగిరి పట్టణంలో శనివారం సాయంకాలం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ వేడితో, ఉక్క పోతలతో అల్లాడిన స్థానిక ప్రజలు, ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, వర్షం కురుస్తూ ఉండడంతో ఉపశమనం పొందుతున్నారు. వర్షం ఇలానే కురిస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది.