పామూరులో అమ్మోరుతల్లో సాంగ్ అదుర్స్

మార్కాపురం జిల్లా పామూరులోని స్థానిక మదన వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని పురవీధుల్లో ఊరేగించి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిన్నారులు దేవతా మూర్తుల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్