కనిగిరి బాలికొన్నత పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఫిర్యాదు పై టీచర్ రంగారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో బాధిత బాలికల బంధువులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పామూరు సిఐ భీమా నాయక్ పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తెలిపారు.