మానవత్వం చాటుకున్న ఆటోవాలా

ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ ఆటోవాలా శుక్రవారం ఒక కుటుంబాన్ని ఆదుకున్నాడు. బొబ్బిలి నుంచి కందుకూరుకు రైలులో వెళ్తున్న కుటుంబంలోని చిన్నారికి అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడంతో, సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో దిగిన ఆ కుటుంబానికి ఆటో డ్రైవర్ సాయం చేశాడు. ఆలస్యం చేయకుండా చిన్నారిని ప్రైవేటు వైద్యశాలకు తరలించి, డబ్బులు లేవని తెలుసుకున్న డ్రైవర్ తన సొంత డబ్బుతో వైద్యం చేయించాడు. దీంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆటో డ్రైవర్ సేవలను పలువురు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్