పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం

ప్రకాశం జిల్లా కొండపిలో రేపు దేశవ్యాప్తంగా జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొండపి ప్రభుత్వ హైస్కూల్ నుండి స్థానిక డిపో సెంటర్ వరకు విద్యార్థులు "నిండు జీవితానికి రెండు చుక్కలు ప్రతి చిన్నారికి వేయిద్దాం పోలియో మహమ్మారిని తరిమి కొడదామంటూ" నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. డిపో సెంటర్లో మానవహారం నిర్వహించి, గ్రామ ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్