రోటరీ క్లబ్ సింగరాయకొండ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు సింగరాయకొండ కీర్తి మెడికల్ యజమాని డాక్టర్ కళ్యాణ్ ఆర్ధిక సహకారంతో ఊళ్ళపాలెంలోని చలివేంద్రం దిబ్బ గిరిజన కాలనీ అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులకు అవసరమైన ప్లేట్లు, గ్లాసులు, ఇనుప అలమరను బుధవారం ఉచితంగా అందజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రోటరీ క్లబ్ సింగరాయకొండ అధ్యక్షులు మాలె రంగారెడ్డి మాట్లాడుతూ మానవ జీవితంలో బాల్యం ఎంతో విలువైందని ఆయన అన్నారు.