కొండేపి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొండేపి మండలం పేరిదేపిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాల కొండయ్య అనే వ్యక్తి సోమవారం మృతి చెందాడు. ముప్పారం గ్రామానికి చెందిన మాల కొండయ్య వ్యక్తిగత పనులపై కొండేపి కి వచ్చాడు. తిరిగి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ మాలకొండయ్యను ఒంగోలు రిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ఘటనలో శివ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్