పేకాట ఆడుతున్న ఏడు మంది అరెస్ట్

ప్రకాశం జిల్లా కొండపి మండలం కోయవారిపాలెం గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడు మందిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6, 850 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రేమ్ కుమార్ మీడియాకు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించి వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని ఎక్కడన్నా పేకాట ఆడటం గమనిస్తే వెంటనే 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై ప్రేమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్