ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకాల బీచ్ లో గురువారం సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి చెందగా ఒక్కరు గల్లంతయ్యారు. గల్లంతైన పవన్ కుమార్ మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు వెలికి తీశారు. హైదరాబాదులో అక్క వద్దనే ఉంటున్న పవన్ కుమార్ నెలరోజుల క్రితం ఓ ప్రముఖ కంపెనీలో డెలివరీ బాయ్ గా ఉద్యోగం పొంది మొదటి జీతం తీసుకున్నాడు. పండగకి ఊరికి వచ్చి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు.