టంగుటూరు: బస్సును ఢీకొట్టిన లారీ

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరమ్మ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆపి ప్రయాణికులను దించుతుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమవైపు భాగం పూర్తిగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్