గత ఐదేళ్లుగా మూడు రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, అక్కడి అభివృద్ధిని చూసి జగన్ అండ్ కో ఓర్వలేకపోతున్నారని మంత్రి స్వామి ఆదివారం విమర్శించారు. ప్రజలు జగన్ కుట్రలను గమనిస్తున్నారని, నిన్న ఏ మొహం పెట్టుకొని వైసిపి నేతలు అమరావతికి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. వైసిపి హయాంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు, వేధింపులతో హింసించిన విషయం గుర్తుకు రాలేదా అని ఆయన నిలదీశారు.