సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డిఎస్సీ పై చేస్తూ యువత భవితకు అండగా నిలవడం టిడిపి విశ్వసనీయతకు అద్దం పడుతుందని మండల టిడిపి అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు అన్నారు. పొన్నలూరులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ తో పాటు డీఎస్సీ పెడతానని హామీలు ఇచ్చి మాట తప్పారన్నారు.