యానాది కాలనీలో అంగన్వాడీ ఉత్సవం

కేంద్ర ప్రభుత్వ సూచనలు మేరకు ఈనెల అక్టోబర్ 25 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ - అంగన్వాడి ఉత్సవంలో భాగంగా త్రిపురాంతకం మండలం సంఘం తండా పంచాయితీ యానాది కాలనీలో అంగన్వాడీ కేంద్రం నందు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా అంగన్వాడి కార్యకర్త ఆదిలక్ష్మి మాట్లాడుతూ అంగనవాడి కేంద్రం ద్వారా అందుతున్న సేవలు, ఉత్సవ ముఖ్య ఉద్దేశాలు గ్రామస్తులకు, లబ్ధిదారులకు వివరించారు. మూడు రోజుల ఉత్సవం లో భాగంగా మహిళలకు రంగురంగుల ముగ్గులు వేయించారు. మ్యాజికల్ చైర్స్ వంటి ఆటలు పాటలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రీస్కూల్ చిన్నారి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕