ప్రకాశం జిల్లా పొదిలి సీఐ వెంకటేశ్వర్లపై జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ మాజీ ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జగన్ పర్యటన నేపథ్యంలో జరిగిన అల్లర్ల ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలను పరామర్శించేందుకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఐ అనుమతి ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫైర్ అయ్యారు.