పల్స్ పోలియో చుక్కలతో చిన్నారులకు రక్షణ: శ్యామల కాశిరెడ్డి

వెలిగండ్ల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి పాల్గొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో వ్యాధి జీవితాంతం వికలాంగత్వానికి దారితీసే ప్రమాదం ఉన్నందున, కేవలం రెండు చుక్కల మందుతో ఆ ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్