రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు చీమకుర్తికి చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో కె శ్రీహరి, వంశీ కృష్ణ, షేక్ ఇలియాస్, పి. కళ్యాణ్ ఉన్నారని కోచ్ ఉమా మహేశ్వర రావు శుక్రవారం తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి 19వ తేదీ వరకు చిత్తూరు జిల్లాలోని డీఎన్ఏ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.