పొదిలిలో బుధవారం మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారని వైసీపీ నాయకులు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు జగన్ పొదిలికి చేరుకొని మధ్యాహ్నం 12:30 వరకు స్థానిక రైతుల సమస్యలను తెలుసుకొని తర్వాత తాడేపల్లికి పయనం అవుతారని జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మంగళవారం తెలిపారు.