దర్శిలో భారీ వర్షం

ప్రకాశం జిల్లా దర్శిలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. నిన్నటి వరకు విపరీతమైన ఎండలు ఉన్నప్పటికీ, నేడు తెల్లవారుజాము నుంచి వాతావరణం ఆహ్లాదకరంగా మారి వర్షం కురిసింది. ఈ మధ్యకాలంలో ఎండకు అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు, బయటకు వెళ్లినవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ మొబైల్ ఫోన్ల ద్వారా తెలిపింది.

సంబంధిత పోస్ట్