మార్కాపురంలో జాబ్ మేళా

మార్కాపురంలోని APSSDC కార్యాలయం, సిరికల్చర్ బిల్డింగ్, సాయి బాలాజీ స్కూల్ ఎదురుగా సెప్టెంబర్ 25న ఉదయం 9: 30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కంచిబాబు తెలిపారు. ఈ జాబ్ మేళాలో Greentech Industries India Pvt. Ltd. , నాయుడుపేట సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హతను బట్టి ₹15, 500 నుంచి ₹20, 000 వరకు జీతం అందించనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కొరకు 9912438757, 7997151082 సంప్రదించండి.

సంబంధిత పోస్ట్

✕
✕