కొనకనమిట్ల: నరకం అనుభవించిన మహిళ

కొనకనమిట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు అగచాట్లు పడుతున్నారు. సోమవారం మండలంలోని చౌటుపల్లి కి చెందిన శిరీష కు తేలు కుట్టింది. రాత్రి 7: 25 నిమిషాల సమయంలో ఆసుపత్రికి వెళ్లి 9 గంటల వరకు వేచి చూసిన ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో గత్యంతరం లేక ఆమెను పొదిలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లారు. ఆ సమయంలో తేలు కాటుకు గురైన మహిళ నరకం అనుభవించిందని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్